Wednesday, 21 August 2013

హయగ్రీవుడు ఆవిర్భవించిన తిధి - శ్రావణ శుద్ధ పూర్ణిమ - 21st august 2013

నారయణుడు విద్యాప్రదాతగ అశ్వముఖముతో అవతరించిన ఈ పుణ్యదినాన్న హయగ్రీవ ఆరాధన విద్యాబుద్ధులను ప్రసాదిస్తుంది.
బుద్ధి సక్తిని పెంపొందిస్తుంది.


విద్యలు రాక్షస బుద్ధికలవారి చేతులలో పడినట్లు అయితె దారుణాలు జరుగుతాయి. ఇవి సన్మార్గుల చేతులకు చేరి లొకశ్రీయం కలగాలంటే, అలాంటి విద్యలను నారయణుని అనుగ్రహముతో సంపాయించాలని చెప్పడమే శ్రీ హయగ్రీవుని ఉత్పత్తి లోని నిగూఢ మర్మం . ఈ రహస్యాన్ని తెలుసుకునెందుకే మనము ఏటా శ్రావణ శుద్ధ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము .

పొట్ట కోసము నేర్చుకునే విద్యలునుంచి ఆధ్యాత్మిక ఙ్ఞానము పెంపొందించే బ్రహ్మవిద్యలు అన్నిటికి హయగ్రీవుడు ఆది దేవుడు !

హయగ్రీవుడు శ్రీ మహా విష్ణువు యొక్క గురు స్వరూపము .

ఈ స్వామిని శివపరంగా కొలిస్తే దక్షిణామూర్తీ అని , దేవిపరంగ ఉపాశన చేసినట్లు అయితే శ్రీ శారదా మూర్తి అని చెబుతారు .

ఈ కారణముగానే హయగ్రీవుని శ్రుతులూ -స్మ్రుతులు ఇలాగ అభివర్ణించాయి .

విశుద్ధ విఙ్ఞాన ఘన స్వరూపం
విఙ్ఞాన విశ్రాణవ బద్ద దీక్షం
దయానిధిం దేహభృతాం శరణ్యం
దేవం హయగ్రీవ మహం ప్రపద్యే
ఙ్ఞానానంద మయం దేవం
నిర్మల స్ఫటికాకృతం
ఆధరం సర్వ విద్యానాం
హయగ్రీవ ముపాస్మహే

ఏ విద్యకైనా ఫలం ఙ్ఞానము - ఆనందము .
ఈ రెండిటి కలయికే ఈ హయగ్రీవమూర్తి !
నిర్మల స్ఫటిక కాంతితో మెరుస్తూ , సర్వ విద్యలకు ఆధారభుతునిగా భక్తులను కరుణిస్తున్నాడు !


  
  

No comments:

Post a Comment